ఈ రోజు సుదర్శన్ థియేటర్ వేదికగా జరిగిన ట్రైలర్ లాంచ్ లో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని కామెంట్స్ అయితే హాట్ టాపిక్ గా మారాయి. ఇక తన గత సినిమా సరిగా ఆడకపోయినా, నా తాత తండ్రి మీకు తెలియకపోయినా ఇంత ప్రేమ నా మీద చూపిస్తున్నారని మైకు ముందు బాగా ఊగిపోయేలా చెప్పాడు.నిజానికి ఇక ఈ కామెంట్ తెలుగు ఇండస్ట్రీలో వారసత్వం మీద ఇన్ డైరెక్ట్ కౌంటరని, అసలు ఆ ప్రస్తావన తేకుండా మాములుగా కూడా మాట్లాడొచ్చని, కావాలనే ఇలా అన్నాడని సోషల్ మీడియాలో నెటిజెన్లు విజయ్ ని ట్రోల్ చేస్తూ రివర్స్ కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు.ఇక్కడ విజయ్ దేవరకొండ ఒక లాజిక్ మిస్ అయ్యాడు. ఒక హీరోకు స్టార్ డం వచ్చాక అతని కుటుంబ సభ్యులు దాన్ని వాడుకుని పరిశ్రమలో సెటిలవ్వడం అన్ని భాషల్లో కూడా ఉన్నదే. అది ఎవరి దాకో ఎందుకు. ఆనంద్ దేవరకొండ తన తమ్ముడు కాకపోతే ఏ నిర్మాత కూడా అసలు ముందుకు వచ్చేవాడు. డెబ్యూ మూవీలో సోసో పెర్ఫార్మన్స్ ఇచ్చినా కూడా తర్వాతి సినిమాలు ఎలా వచ్చాయి. ఇప్పటికీ చేతిలో బ్లాక్ బస్టర్ సినిమా లేకపోయినా కేవలం దేవరకొండ తమ్ముడనే స్టాంప్ తోనే చేతిలో మూడు నాలుగు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు.


ఇది నిజమేగా..ఇక అలాంటప్పుడు తాతలు తండ్రుల మాటలు అనడం అవసరమే లేదు. ఆ మాటకొస్తే చిరంజీవి,రవితేజ, రజినీకాంత్ వీళ్లంతా కూడా దశాబ్దాల తరబడి ఏలుతున్నారంటే దానికర్థం వాళ్ళ పూర్వికులు ఆడియన్స్ కి తెలుసని కాదుగా. పైగా వాళ్లేప్పుడు విజయ్ దేవరకొండ లాగా ఇంత బడాయిగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడలేదు.డిజాస్టర్లు వచ్చినా హిట్లు కొట్టినా అభిమానం విషయంలో ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒకేలా ఉంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండకూ కూడా అంతే.ప్రతి హీరోకి కూడా ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఆ స్టార్ డం తరతరాలుగా నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఏదో ఒక సినిమా హిట్ అయినంత మాత్రానా నెంబర్ 1 హీరో కాలేరు.ఒక బూతు సినిమాతో క్రేజ్ సంపాదించాడని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరి కాదు. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒక్కసారి కింద పడి అడ్రెస్ లేకుండా పోయిన హీరోలు చాలా మందే వున్నారు. విజయ్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: