ప్రస్తుతం తెలుగు సినిమాల హవా నడుస్తుంది. అవి రిలీజ్ అయ్యి కేవలం ఉత్తర భారతం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా డబ్బింగ్ అయ్యి ఎన్నో దేశాల సినీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. బాహుబలి నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రస్థానం ప్రస్తుతం నిఖిల్ సినిమా కార్తికేయ 2 దాకా వెళ్లి ఇంకా విజయవంతంగా కొనసాగుతుంది. ఇక ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ద్వారా పదుల కొద్ది దేశాల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రేక్షకులకు చేరువ అయ్యింది.లోకల్ భాషల్లో కొన్ని చోట్ల...అలాగే భాష సబ్ టైటిల్స్ తో కొన్ని చోట్ల ఆర్ ఆర్ ఆర్ సినిమాను ప్రేక్షకులు ఇంకా చూస్తూనే ఉన్నారు.ఇంకా అలాగే మరో వైపు ఇంకా థియేట్రికల్ రిలీజ్ కు కూడా పలు దేశాలు ఈ సినిమా ను రెడీ చేస్తున్నాయి. జపాన్ లో ఈ సినిమాను అక్టోబర్ 21వ తేదీన రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.అక్కడ డబ్బింగ్ చేయడంతో పాటు ప్రత్యేకంగా పోస్టర్స్ ను క్రియేట్ చేయించారు. అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని అక్కడి ఫిల్మ్ మేకర్స్ థియేటర్ రిలీజ్ కు రెడీ అయ్యారట.తాజాగా జపాన్ లో సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. అక్కడి వారు క్రియేట్ చేసిన ఈ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 
ఇద్దరు హీరోలను హైలైట్ చేస్తూనే సినిమాలో అత్యంత ఆసక్తికరమైన జంతువుల సీన్ ని పోస్టర్ లో చూపించారు.హీరోలు నీరు నిప్పు కాన్సెప్ట్ ను కంటిన్యూ చేస్తూనే మరో వైపు జంతువులను చూపిస్తూ ఒక మంచి బ్యాక్ గ్రౌండ్ తో పోస్టర్ ను డిజైన్ చేసిన అక్కడి వారి క్రియేటివిటీకి అంతా కూడా ఫిదా అవుతున్నారు. తెలుగు లో మరియు ఇతర ఇండియన్ భాషల్లో విడుదల అయిన సమయంలో ఇలాంటి ఒక అద్భుతమైన పోస్టర్ ను చూడలేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ అతి భారీ మల్టీ స్టారర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటించారు. అల్లూరి మరియు కొమురం భీమ్ పాత్రల్లో ఈ హీరోలు నటించి మెప్పించారు. ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఈ సినిమా ముందు ముందు మరిన్ని దేశాల్లో విడుదల అయ్యి అంతకు మించి వసూళ్లు సాధించి హిట్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR