టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ హీరో ఆ తర్వాత ఫలక్ నామ దాస్ మూవీ లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఆ మూవీ కి దర్శకత్వం కూడా వహించి దర్శకుడిగా కూడా విశ్వక్ సేన్ సక్సెస్ ను సాధించాడు. ఇలా పలాక్ నామ దాస్ మూవీ తో దర్శకుడిగా మంచి మార్కులు వేయించుకున్న విశ్వక్ సేన్ తాజాగా మరో మూవీ లో నటిస్తూ , ఆ మూవీ కి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. 

ప్రస్తుతం విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో విశ్వక్ సేన్ నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు.  వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. నివేదా పేతురాజ్మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ప్రసన్న కుమార్ బెజవాడ ఈ మూవీ కి కథను మరియు మాటలను అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 95 శాతం వరకు పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలియ జేస్తూ మూవీ యూనిట్ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. దాస్ కాస్ దమ్కీ మూవీ పక్కా మాస్ యాక్షన్ త్రిల్లర్ మూవీ గా తెరకెక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: