సౌత్ లో సహాయ నటీమణుల్లో నిన్నటి తరం సహజ నటీమణుల్లో ' మాధవి ' కూడా ఒకరు. ఎన్నో సినిమాల్లో, మరెన్నో భాషల్లో కేవలం పదేళ్ళ యాక్టివ్ సినిమా కెరీర్ లో 90 చిత్రాలకు పైగా నటించింది.

తన నటనతో హీరోయిన్ మాధవి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. తనకంటూ ఫ్యామిలీ నటిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది.

బహుశా, ఆ ఇమేజ్ కారణంగానే మాధవి అప్పట్లో బోల్డ్ సినిమాలు చేయలేకపోయింది. కానీ, మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ గా రాణించాలని మాధవి ఎంతో కష్టపడింది. ఈ క్రమంలోనే హిందీలో స్టార్ హీరోయిన్ కావాలని కలలు కంది. అయినా 'మాధవి'కు హిందీలో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. బాలీవుడ్ లో నిరుత్సాహం ఆమెను ఆవహించింది.

దీనికి తోడు, ఆ సమయంలో మాధవి వ్యక్తిగత జీవితం కూడా మోసాల పరంపరలో చితికిపోతూ సాగింది. హిందీలో మాధవిహీరో చేతిలో దారుణంగా మోసపోయింది. అలాగే ఓ సౌత్ హీరో కూడా ఆమెను అతి దారుణంగా మోసం చేశాడు. ఈ హీరో గొప్ప నటుడు కూడా. రీసెంట్ గా సూపర్ హిట్ కొట్టాడు. అప్పులు అన్నీ తీర్చేసుకున్నాడు.

కాగా ఆ రోజుల్లో ఈ లోక నాయకుడితో 'మాధవి'కి మంచి చనువు ఏర్పడింది. అతని స్నేహంలో మాధవి పరిధులు కూడా దాటింది అని అప్పటి పుకార్ల సారాంశం. అయితే, మాధవి సినీ కెరీర్ ను కొన్నాళ్ళు పాటు పరదా చాటుకి నెట్టేశాడు ఆ హీరో. హీరోయిన్ గా ఆమెకు హిందీ ఛాన్స్ లు వస్తున్న క్రమంలో మాధవితో ప్రేమ పాటలు పాడుకుంటూ ఆ ఛాన్స్ లు ఆమె వదులుకునేలా చేశాడు.

అతగాడి ప్రేమలో పూర్తిగా మునిపోయిన మాధవి, వచ్చిన బాలీవుడ్ అవకాశాలను కాదు అనుకుంది. ఫలితంగా మాధవి బాలీవుడ్ కెరీర్ ట్రాక్ తప్పింది. పైగా సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ లు తగ్గాయి. ఇక మాధవి కెరీర్ అయిపోయింది అనుకున్నారు. ఆమె పరిస్థితి గ్రహించిన మరో దర్శకుడు మాధవిను వ్యాపార వస్తువుగా మార్చడానికి మళయాలంలో ఓ బూతు సినిమాని కూడా ప్లాన్ చేశాడు.

ఆ సమయంలోనే 'మాధవి' కుటుంబం ఆమెను మళ్లీ సినిమాల్లో నటించకూడదు అని షరతులు విధించింది. అప్పటికే మాధవి కుటుంబానికి బిజినెస్‌ మ్యాన్‌ గా ఎదుగుతున్న రాల్ఫ్ శర్మ తో మంచి పరిచయం కలిగింది. రాల్ఫ్ శర్మతో మాధవి పెళ్లి చేశారు. వీరికి ముగ్గురు కూతుర్లు. ఇప్పుడు అమెరికాలో బిజినెస్ మేన్ రాల్ఫ్ శర్మ రాణిస్తున్నారు. వేల కోట్లకు యజమానిగా 'మాధవి' జీవితం ఇప్పుడు చాలా గొప్పగా సాగుతుంది. కానీ, 'మాధవి' జీవితంతో ఆడుకున్న సదరు లోక నాయకుడి గారి పరిస్థితి మాత్రం రోజురోజుకు దిగజారి పోతుంది. ఇంకా అతగాడికి అప్పులు ఉన్నాయి. ఇది కర్మ ప్రతిఫలం ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి: