హిట్ ,  ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస మూవీ లలో నటిస్తూ వస్తున్న తెలుగు యువ హీరోలలో ఆది సాయికుమార్ ఒకరు. ప్రేమ కావాలి మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకొని తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆది సాయికుమార్ ప్రస్తుతం వరస మూవీ లలో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఆది సాయికుమార్ 'తీస్ మార్ ఖాన్' అనే మూవీ లో హీరోగా నటించాడు.

మూవీ లో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో పాయల్ రాజపుత్ తన అందచందాలతో ప్రేక్షకులను బాగానే అలరించింది. కళ్యాణ్ జి గోగణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు కాస్త ఆసక్తిని పెంచే విధంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెంచుకున్నారు. అలా పరవాలేదు అని రేంజ్ అంచనాల నడుమ 19 ఆగస్ట్ 2022 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది.

ఇలా ప్రేక్షకుల అంచనాలను అందుకో లేక పోయిన ఈ మూవీ తాజాగా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ప్రముఖ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయిన అమెజాన్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: