చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా జె.డి. స్వామి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘వేద’. దీన్ని జె. సుధాకర్, శివ బి, రాజీవ్ కుమార్ బి, శ్రీనివాస్ లావూరి, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ మూవీ టీజర్ ను క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఆవిష్కరించారు. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుకుమార్‌ మాట్లాడుతూ, ”ఈ సినిమాకు స్వామి ఏడు కొండలు లాగా ఏడుగురు నిర్మాతలు ఉన్నారు. ఇక్కడే వీరి సక్సెస్ కన్‌ఫర్మ్‌ అయింది. టీజర్‌ చాలా బాగుంది. మోషన్‌ పోస్టర్‌ అదిరిపోయింది. టైటిల్‌ కూడా నైస్‌. నిర్మాతలు అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. సంగీత దర్శకుడు అజయ్‌ మంచి వర్క్‌ చేశారు. చంద్రబోస్‌ గారి సాహిత్యం రాకింగ్‌. హీరో చేనాగ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ చాలా బాగుంది” అని అన్నారు. చంద్ర బోస్ మాట్లాడుతూ, ”ప్రపంచంలోని ఏడు వింతలను చూడలేదు కానీ ఈ సినిమా ఏడుగురు నిర్మాతలను చూశాను. చిత్ర దర్శకుడు జె.డి. చిన్ననాటి ఫ్రెండ్. నాకంటే చిన్న అయినా మేము కలసి చదువుకున్నాం. కలసి ఆడుకున్నాం. నేను ఏం చేస్తే తను అదే చేసేవాడు. నేను సినిమాలలోకి వస్తే ఇప్పుడు తను సినిమాలలోకి వచ్చాడు. అక్షరానికి గౌరవమిచ్చే సంగీత దర్శకుడు అజయ్ కు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎన్నో అవరోదాలను దాటుకొని వచ్చాడు జె.డి. పట్టుపట్టి నాతో నాలుగు పాటలు రాయించుకున్నాడు. నా భార్య సుచిత్ర కూడా ఒక పాటకు కొరియోగ్రఫీ చేసింది” అని తెలిపారు

దర్శకుడు జె.డి. స్వామి మాట్లాడుతూ, ”ఈ సైకో రొమాంటిక్ థ్రిల్లర్ కథను రెడీ చేసుకొని ముందుకు రావడానికి ముగ్గురు కారణం. వారే చిత్ర నిర్మాతలు, దర్శకులు సుకుమార్, చంద్రబోస్ గార్లు. మన లైఫ్ లో తల్లి, తండ్రి, గురువు అనే వారు సిగ్నిఫికెంట్ గా ఉంటారు. ఈ ప్రాజెక్ట్ కు తల్లిగా నిర్మాతలు ఉన్నారు. తడబడుతూ అడుగులు వేస్తుంటే తండ్రిగా ధైర్యాన్ని ఇచ్చి నడక నేర్పారు సుకుమార్ గారు. అలాగే ప్రేమంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? అంటూ చంద్రబోస్ గారు కొత్త కాన్సెప్ట్ తో పాట రూపంలో చాలా విషయాలు నేర్పించారు. చాలామంది సిగరెట్ రూపంలో, కోకైన్ రూపంలో డ్రగ్స్ తీసుకుంటుంటారు. ఆ డ్రగ్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ను డ్యామేజ్ చేస్తుంది. అయితే ఈ ఫిల్మ్ లో ఇచ్చే డ్రగ్ మాత్రం మీకు ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ను క్యూర్ చేసి మిమ్మల్ని లైఫ్ లాంగ్ హెల్తీగా ఉంచుతుంది” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: