ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అనంత శ్రీరామ్ హవా నడుస్తోంది. ఇంజనీరింగ్ చదువుకుంటూ ఆచదువులో తనకు అభిరుచిలేక సినిమా పాటల రచయితగా మారిన అనంత శ్రీరామ్ కలం నుండి చాల మంచి పాటలు వస్తున్న నేపధ్యంలో చాలామంది ప్రముఖ దర్శక నిర్మాతలు అతఃడికి అవకాశాలు బాగా ఇస్తున్నారు.


దసరా రేస్ కు విడుదలై విజయం సాధించిన ‘గాడ్ ఫాదర్’ మూవీలో అనంత శ్రీరామ్ ఒక భారీ ఫైట్ కు బ్యాక్ గ్రౌండ్ గా క్లిష్ట పదాలతో కూడిన ఒక పాటను వ్రాసి విమర్శకుల ప్రశంసలు కూడ అందుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడు వ్రాసిన ‘నజబజ జజరా’ పాట గురించి మాట్లాడుతూ ఈపాట తాను వ్రాసిన తరువాత రికార్డింగ్ కు వెళ్లకముందు ఈపాటను చూసిన చిరంజీవి తనకు ఫోన్ చేసి  'చంపకమాల' ఫార్ములా తీసుకుని దానితో 'మత్తేభం' ని వివరించడం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పాడు.



అంతేకాదు చిరంజీవి పవిత్రమైన ఏనుగు గురించి మాట్లాడిన తీరు తనను ఆశ్చర్యపరిచిందని అంటూ చిరంజీవి చాల పుస్తకాలు చదివిన విషయం తనకు తెలుసనీ అయితే తెలుగు సాహిత్యం పై చిరంజీవికి అంత పట్టు ఉంది అన్నవిషయం తనకు తెలియదని కామెంట్స్ చేసాడు. దర్శకుడు చెప్పే భారీ డైలాగ్స్ ను పొల్లుపోకుండా చక్కగా చెప్పి కోట్లాదిమంది అభిమానాన్ని దోచుకున్న చిరంజీవి ప్రయత్నించి ఉంటే మంచి కవిగా కూడ మారి ఉండేవాడు అంటూ అనంత శ్రీరామ్ చిరంజీవి పై ప్రశంసలు కురిపించాడు.


ఇది ఇలా ఉంటే ‘గాడ్ ఫాదర్’ మూవీకి సంబంధించి నెగిటివ్ ప్రచారం చేసిన కొన్ని ప్రముఖ మీడియా సంస్థల ప్రతినిధులను చిరంజీవి ఈమధ్య తన వద్దకు పిలిపించుకుని వారితో మాట్లాడటమే కాకుండా ఆసినిమాలో ఉన్న నెగిటివ్ అంశాలు ఏమిటి అంటూ ప్రశ్నించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అనుకోని పరిణామానికి షాక్ అయిన ఆమీదియా సంస్థల ప్రతినిధులు తమకు కాని తమ సంస్థల యజమానులకు కానీ చిరంజీవితో ఎటువంటి గ్యాప్ లేదనీ ఏదో అనుకోకుండా అలాంటి నెగిటివ్ రివ్యూలు వ్రాయవలసి వచ్చింది అంటూ సున్నితంగా చెప్పి అక్కడితో ఆవిషయాన్ని క్లోజ్ చేసినట్లు గాసిప్ లు హడావిడి చేస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: