టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నాగ చైతన్య ఈ సంవత్సరం బంగార్రాజు ,  థాంక్యూ , లాల్ సింగ్ చడ్డ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య తాజాగా తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే  ఈ మూవీ నాగ చైతన్య కెరియర్ లో 22 వ మూవీ గా తెరకెక్కుతోంది. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ నాగ చైతన్య కెరియర్ లో 22 వ మూవీ గా రూపొందుతూ ఉండటంతో ,  ఈ సినిమా "# ఎన్ సి 22"  అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. ఈ మూవీ లో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే వీరిద్దరూ బంగార్రాజు మూవీ లో కలిసి నటించారు. 

మూవీ లో వీరిద్దరి జంటకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమా. ఈ మూవీ కి ఇళయ రాజా ,  యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక కీలకమైన అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి ప్రియమణి నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: