బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షారుక్ ఖాన్ ఇప్పటి వరకు తాను నటించిన మూవీ లతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం షారుక్ ఖాన్ వరుస మూవీ లలో హీరోగా నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా షారుక్ ఖాన్ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ అనే మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు.

మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ లో షారుక్ ఖాన్ సరసన నయన తార హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  ప్రియమణి ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ని హిందీ , తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ ,  మలయాళ భాషల్లో కూడా ఒకే సారి విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికీ చిత్రీకరణ దశలోనే ఉన్న ఈ మూవీ కి "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ నుండి అదిరి పోయే క్రేజీ ఆఫర్ వచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ హిందీ , తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ భాషల డిజిటల్ హక్కులకు 100 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే జవాన్ మూవీ పై భారత దేశ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: