ఇంద్ర చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు రికార్డులను క్రియేట్ చేశారు చిరంజీవి. ఆ తర్వాత ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందుకున్నారు. అయితే 2004లో విడుదలైన అంజి సినిమా ఘోరమైన ప్లాప్ ని చవిచూసింది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రమైన నిరాశను కనబరిచింది దీంతో మెగా అభిమానులు చాలా నిరుత్సాహ చెందారు. అయితే అదే ఏడాది అక్టోబర్ నెలలో వచ్చిన శంకర్ దాదా ఎం.బిబి.ఎస్ సినిమా సూపర్ హిట్ అయ్యి మెగా అభిమానులను కాస్త ఆనందపరిచిందని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని జయంతి సి పనార్జి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన మున్నాభాయ్ చిత్రానికి రీమెక్కుగా తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో శంకర్ దాదా ఎంబిబిఎస్ పేరుతో విడుదలై ఇప్పటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతటి కలెక్షన్లను సాధించింది ఒకసారి తెలుసుకుందాం.

1). నైజాం-8.55 కోట్ల రూపాయలు.
2). సిడెడ్-5 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-2.76 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-2.4 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-1.68 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-2.2 కోట్ల రూపాయలు
7). కృష్ణ-1.85 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-1.18 కోట్ల రూపాయలు
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.25.8 కోట్ల రూపాయలు రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్-2.18 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే రూ. 27.26  కోట్ల రూపాయలు రాబట్టింది.


శంకర్ దాదా ఎం.బిబి.ఎస్ సినిమా రూ.20 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఈ చిత్రం ముగిసే సమయానికి రూ.27.26 కోట్ల రూపాయల కలెక్షన్ చేసింది. దీంతో ఈ సినిమా కొన్న బయర్లకు దాదాపుగా రూ.7.26 కోట్ల రూపాయలు లాభాన్ని అందించిందని చెప్పవచ్చు ఇక ఈ చిత్రం అప్పట్లోనే మంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: