టాలీవుడ్ లో ఎంతోమంది ప్రముఖ దర్శకులు ఉన్నారు. అయితే ప్రస్తుతం వారిలో రాజమౌళి త్రివిక్రమ్ ల పరిస్థితి మినహా మిగతా దర్శకుల క్రేజ్ పెద్దగ కనిపించక పోవడంతో మన హీరోలు తమిళ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆశక్తి కనపరుస్తున్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ కోలీవుడ్ టాప్ దర్శకులు కూడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమ సత్తా చాటడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక భారీ మల్టీ స్టారర్ చేస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్య కూడ వెంకట ప్రభు దర్శకత్వంలో మరొక సినిమాను చేస్తున్నాడు. ఇది జూనియర్ ఎన్టీఆర్ తమిళ దర్శకుడు అట్లీ తో ఒక భారీ మూవీ చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదయ శీతమ్’ మూవీ రీమేక్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు.  అదేవిధంగా గోపీచంద్ ‘సింగం’ దర్శకుడు హరితో ఒక మూవీ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరస ఫ్లాప్ లతో ఉన్న రవితేజా తమిళ మాస్ డైరెక్టర్ గా పేరు గాంచిన బాలాజీ మోహన్ తో సినిమా చేయడానికి రాయబారాలు చేస్తున్నట్లు టాక్. ఇక రామ్ లింగ్ స్వామిల కాంబినేషన్ మూవీ ‘వారియర్’ ఫెయిల్ అయినప్పటికీ లింగ్ స్వామికి టాలీవుడ్ లో ఇంకా బాగా అవకాశాలు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.‘గాడ్ ఫాదర్’ విజయంతో జోష్ లో ఉన్న మోహన్ రాజా తో సినిమాలు చేయాలని చాలామంది ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయే అతడి 100వ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒక్క మహేష్ తప్ప మిగతా అందరు టాప్ హీరోలు తమిళ దర్శకుల వైపు చూస్తూ ఉండటంతో వీరి మ్యానియా టాలీవుడ్ దర్శకులకు టెన్షన్ పట్టిస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి..  మరింత సమాచారం తెలుసుకోండి: