టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ దర్శకులలో ఒకరు అయిన అనుదీప్ కేవీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనుదీప్ కేవి , నవీన్ పోలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా తెరకెక్కిన జాతి రత్నాలు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. జాతి రత్నాలు మూవీ లో ఈ దర్శకుడు కామెడీ ని మలిచిన విధానానికి ఇటు ప్రేక్షకుల నుండి ... అటు విమర్శకుల నుండి ఈ దర్శకుడి కి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇలా జాతి రత్నాలు మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ దర్శకుడు తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీ రోలలో ఒకరు అయిన శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ అనే మూవీ ని తెరకెక్కించాడు.

మూవీ ని అక్టోబర్ 21 వ తేదీన  తమిళ మరియు తెలుగు భాషలలో ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ లో కూడా దర్శకుడు అనుదీప్ కేవి ఎక్కువ శాతం కామెడీ పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ప్రిన్స్ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా చేసింది. ప్రిన్స్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 18 వ తేదీన సాయంత్రం 6 గంటలకు "జే ఆర్ సి" కన్వెన్షన్ సెంటర్ , హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: