గత 45 సంవత్సరాలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని శాసిస్తున్న చిరంజీవి పేరు ఎరుగని వారు ఉండరు. నాలుగు తరాల ప్రేక్షకులతో సాన్నిహిత్యం ఉన్న చిరంజీవికి వివాదరహితుడుగా ఉండాలి అన్నది ఆయన కోరిక. అయితే దానికి భిన్నంగా ఆయన రాజకీయాలలోకి వచ్చి ‘ప్రజారాజ్యం’ పార్టీని పెట్టి ఎన్నికలలో ఓడిపోయినప్పటికి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసి కొన్ని రకాల వివాదాలకు చిరునామాగా మారాడు.


సుమారు 9 సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న చిరంజీవి తిరిగి యూటర్న్ తీసుకుని సినిమా రంగంలోకి రావడమే కాకుండా తిరిగి తన నెంబర్ వన్ స్థానాన్ని కొనసాగిస్తున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన ‘గాడ్ ఫాదర్’ హిట్ రావడంతో జోష్ లో ఉన్న చిరంజీవి ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పొలిటికల్ ఫెయిల్యూర్ పై విభిన్నంగా స్పందించాడు.


ప్రస్తుతం ‘ప్రజారాజ్యం పార్టీ లేకపోవడం వల్ల తాను బాగానే ఉన్నానని అలా కాకుండా ప్రజారాజ్యం పార్టీ కొనసాగి ఉండి ఉంటే తాను ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం అయి తెలంగాణాను వదులుకోవలసి వచ్చేదనీ అయితే ఇప్పుడు తాను మళ్ళీ వరసపెట్టి నటిస్తూ ఉండటంతో తనను రెండు రాష్ట్రాల ప్రజలు సమానంగా ఆదరిస్తున్న విషయాన్ని గుర్తుకు చేసాడు. ఇది ఒకవిధంగా తన అదృష్టం అని అంటున్నాడు.


తన నుంచి ప్రేక్షకులు చాల ఆశిస్తారని అందువల్ల తాను నటించే సినిమాలలో ప్రయోగాలు చేయడం చాల కష్టం అని చెపుతూ తాను ప్రయోగాలు చేస్తే తన పై పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు కోట్లాది రూపాయల నష్టం వస్తుందని తనకు అది ఇష్టం లేదు అని అంటున్నాడు. అయితే రొటీన్ సినిమాలకు భిన్నంగా సినిమాలు చేయాలన్న కోరికతో తాను ‘గాడ్ ఫాదర్’ లో నటించానని ఆసినిమా హిట్ అవ్వడంతో తన ఆలోచనలు మారి మరిన్ని డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఉత్సాహం ఇచ్చ్హింది అని అంటున్నాడు..




మరింత సమాచారం తెలుసుకోండి: