ప్రస్తుతం హిట్ , ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ముందుకు దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో రాజావారు రాణి గారు మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తో మంచి విజయాన్ని అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం సెబాస్టియన్ , సమ్మతమే , నేను మీకు బాగా కావలసిన వాడిని అనే మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూడు మూవీ లు కూడా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయాయి. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని జీ ఏ 2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తుండగా .. మెగా నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. మురళీ కిషోర్‌ అబ్బురూ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ కి చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ను విడుదల చేసింది. తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ని 17 ఫిబ్రవరి 2023 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో కిరణ్ అబ్బవరం చుట్టూ చాలా మంది గన్నులు  పట్టుకొని నిల్చొని ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: