క్రియేటివ్ దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ ఏక్షణాన మొదలుపెట్టాడో తెలియదు కానీ ఆసినిమాను వెంటాడుతున్న కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొంతకాలం ఈసినిమాను కరోనా సమస్యలు వేదిస్తే కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ పవన్ రాజకీయ కార్యకలాపాలు ఈసినిమా పూర్తి అవ్వడానికి అడ్డు తగులుతున్నాయి.


గత కొంతకాలంగా పవన్ ను టార్గెట్ చేస్తూ రాజకీయ విమర్శలు పెరిగిపోతున్నాయి. దీనితో పవన్ తన సహనాన్ని కోల్పోయి తాను నటించవలసి ఉన్న సినిమాల షూటింగ్ లపై కూడ దృష్టి పెట్టలేకపోతున్నాడు అని అంటున్నాడు. ఈమధ్య మళ్ళీ ఈమూవీ షూటింగ్ ఒక భారీ యాక్షన్ సీన్ తో ప్రారంభం అయింది. ఒక భారీ సెట్ వేసి విదేశాల నుంచి ఫైటర్స్ ను తెప్పించి వందలాది గుర్రాలను రెడీ పెట్టి పవన్ తో షూటింగ్ మొదలు పెట్టారట.


ఒక రెండు రోజుల పాటు ఈమూవీ షూటింగ్ కొనసాగిన తరువాత పవన్ పై మాటల దాడి విపరీతంగా పెరిగిపోవడంతో దానికి చెక్ పెట్టడానికి తిరిగి పవన్ తన రాజకీయ మీటింగ్ లతో బిజీ అయిపోయాడు. అయితే క్రిష్ షూట్ చేయవలసి ఉన్న భారీ యాక్షన్ సీన్ కోసం విదేశాల నుంచి వచ్చిన ఫైటర్స్ గుర్రాలు అన్నీ ఖాళీగా ఉంచడం ఇష్టంలేక ఒవ్న్ లేకపోయినా అతడి డూప్ తో ఈ భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేయాలని క్రిష్ ఎదోవిధంగా ప్రయత్నిస్తూ ఆ యాక్షన్ సీన్ షూట్ చేస్తున్నాడట.


వచ్చే సోమవారం నుండి పవన్ షూటింగ్ స్పాట్ కి రాబోతున్న పరిస్థితులలో పవన్ తో ఈ ఫైట్స్ కు సంబంధించి క్లోజప్ షాట్స్ తీసి ఆతరువాత ఎడిటింగ్ లో గ్రాఫిక్ సహాయంతో మొత్తం ఫైట్ సీన్ అంతా పవన్ చేసాడు అన్న అభిప్రాయం వచ్చే విధంగా టెక్నాలజీ సహాయంతో ఈమూవీ షెడ్యూల్ ను ఏదోవిధంగా పూర్తి చేయాలని క్రిష్ పాట్లు పడుతున్నట్లు టాక్. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారడంతో ఈ న్యూస్ లో ఎన్ని యదార్థాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలు లోలోపల విచారణ చేస్తున్నట్లు టాక్..




మరింత సమాచారం తెలుసుకోండి: