
ఈ సినిమా ప్రమోషన్లలో యాక్టివ్ గా పాల్గొన్న జాన్వీ కపూర్. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమాని రిలీజ్ ప్లాన్ చేయడంతో ఇక్కడ కూడా ప్రమోషన్స్ లో పాల్గొనింది. హైదరాబాదులో జాన్వి మిలి ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. ఆ సమయంలో టాలీవుడ్ పైన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. అంతేకాకుండా ఎన్టీఆర్ తో తన నటించాలని ఉందని కూడా తెలియజేసింది. ఎన్టీఆర్ అంత గొప్ప నటుడుతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని తన మనసులో మాట చెప్పడంతో అటు, ఎన్టీఆర్ అభిమానులు, శ్రీదేవి అభిమానులు జాన్వి అభిమానులు చాలా ఖుషి అవుతున్నారు.
కాఫీ విత్ కరన్ లో జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండ తో రొమాన్స్ కి రెడీ అని డైరెక్ట్ గా చెప్పకనే చెప్పేసింది. అలాంటిది హైదరాబాదులో కనీసం విజయ్ దేవరకొండ పేరు కూడా చెప్పలేదు అందుకు కారణం విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ప్లాప్ అవడమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ చిత్రం హడావిడి లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఎన్టీఆర్ సినిమాలో నటిస్తానని చెప్పడంతో అప్పుడు ఒప్పుకోకుండా ఇప్పుడు ఒప్పుకుంటుంది ఇంతలోనే ఎంత మార్పు అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు నేటిజన్స్.