మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక మూవీ లలో హీరోగా నటించిన విశ్వక్ సేన్ అందులో కొన్ని మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో అశ్విత్ మరిముత్తు దర్శకత్వం లో తెరకెక్కిన ఓరి దేవుడా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ లో విశ్వక్ సేన్ సరసన మిధాలీ పాల్కర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం తో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. 

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ఆహా "ఓ టి టి"  ప్లాట్ ఫామ్ లోకి అందుబాటు లోకి వచ్చింది. ఈ మూవీ కి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయిన  40 గంటల్లోనే ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది. ఈ విషయాన్ని ఆహా నిర్వాహక బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇలా ఓరి దేవుడా మూవీ ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: