హాలీవుడ్  టాప్  డైరెక్టర్  జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన అవతార్ సినిమా 2009లో విడుదలైంది. ఈ సినిమాలో జో సల్దానా- సామ్ వర్తింగ్టన్- సిగౌర్నీ వీవర్- లాజ్ అలోన్సో నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలన విజయం సాధించింది. దాదాపు 24 వేల కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ వసూళ్లకు సమానమైన బిజినెస్ చేసిన అవతార్ 2 అంతకుమించి వసూలు చేస్తుందని ట్రేడ్ భావిస్తోంది.ఈ చిత్రం ఇప్పటికే 2.2 బిలియన్ డాలర్ల  వరల్డ్ వైడ్ బిజినెస్ సాగించిందని సమాచారం తెలుస్తుంది.అంటే దాదాపు 18000 కోట్ల వరకు బిజినెస్ చేసింది. 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' విడుదల కోసం ప్రపంచ దేశాలతో పాటు భారత దేశం కూడా ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తోంది. ఈ వెయిటింగ్  ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవాలంటే అడ్వాన్స్ బుకింగ్ లను చూస్తే అర్థమవుతోంది.  కేవలం మూడు రోజుల వ్యవధిలో 45 స్క్రీన్ లలో ఈ సినిమాకి సంబంధించిన ఏకంగా 15000 పైగా టిక్కెట్లు ప్రీమియం ఫార్మాట్ లలో ఇప్పటికే అమ్ముడయ్యాయి.


డిసెంబర్ 16 వ తేదీన థియేటర్లలో సినిమా విడుదల కావడానికి ఇంకా మూడు వారాల సమయం ఉన్నందువల్ల అడ్వాన్స్ సేల్స్ అనేవి మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది.ఇక అవతార్ 2 సినిమా లాంగ్ రన్ లో మునుపటి రికార్డులన్నిటినీ బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. రిలీజైన తొలి మూడు వారాల్లోనే ఈ సినిమా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని కూడా విశ్లేషిస్తున్నారు. ఇంకా అలాగే అవతార్ 2 కేవలం భారత దేశం నుంచి 500 నుంచి 1000 కోట్ల దాకా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా 100 కోట్ల వసూళ్లు మినిమంగా వసూలు చేసేంత క్రేజ్ అవతార్ 2 సినిమాకి ఉందని విశ్లేషణలు సాగుతున్నాయి.మరి చూడాలి ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: