‘లవ్ టుడే’ విడుదల అయ్యేంతవరకు ఆసినిమాలో హీరోగా నటించిన ప్రదీప్ రంగనాధన్ పేరు ఎవరికీ తెలియదు. ఈసినిమాకు అతడు హీరో మాత్రమే కాకుండా ఆమూవీకి అతడు దర్శకత్వం వహించాడు. అతి తక్కువ పెట్టుబడితో నిర్మింపబడ్డ ఈమూవీ తమిళనాడులో సూపర్ హిట్ కావడంతో ఆమూవీని తెలుగులో డబ్ చేసి దిల్ రాజ్ విడుదల చేసాడు.


ఈమూవీ తెలుగు రాష్ట్రాలలో కూడ హిట్ టాక్ తెచ్చుకుంది. షాకింగ్ గా ఈమూవీకి మెట్రో A గ్రేడ్ సెంటర్లతో పాటు బిసి సెంటర్లలోని ప్రేక్షకులు కూడ ఈమూవీని చూడటానికి బాగా వస్తూ ఉండటంతో తెలుగు రాష్ట్రాలలో ఈమూవీని విడుదల చేసిన దిల్ రాజ్ కు కాసులు వర్షం ఖాయం అన్న అంచనాలు వచ్చాయి. ‘హిట్ 2’ విడుదల అయ్యేంతవరకు ఈవారం అంతా ఈమూవీ హడావిడి కొనసాగుతుందని చాలామంది భావించారు.


అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తీసుకున్న నిర్ణయంతో ‘లవ్ టుడే’ కలక్షన్స్ కు గండి పడబోతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనికికారణం నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ 2 నుండి ‘లవ్ టుడే’ వెర్షన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమ్ కానున్నది. కేవలం నాలుగురోజులు మాత్రమే గ్యాప్ ఉండటంతో యూత్ ఈసినిమాకు డబ్బు పెట్టి టిక్కెట్ కొనుక్కుని వచ్చి చూసేకంటే నాలుగు రోజులు ఓపిక పడితే ఇంట్లోనే ఈమూవీని చూడవచ్చుకదా అన్న ఆలోచనలోకి వెళితే ఈరోజు సోమవారం నుండి ఈమూవీ కలక్షన్స్ కు చెక్ పడే ఆస్కారం కనిపిస్తోంది.


ఈమూవీని విడుదల చేసేముందే ఈమూవీ నిర్మాతలు నెట్ ఫ్లిక్స్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం డిసెంబర్ 2 నుండి స్ట్రీమ్ అవ్వడం ఖచ్చితంగా మారింది. వాస్తవానికి ఓటీటీ లో వస్తున్నది తమిళ వెర్షన్ అయినప్పటికీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి కాబట్టి వాటితో సరిపెట్టుకుని తెలుగు రాష్ట్రాలలోని యూత్ ఈమూవే కోసం ధియేటర్లకు రాకపోతే దిల్ రాజ్ కు లాభాలు వచ్చినట్లే వచ్చి మాయం అయిపోయే ఆస్కారం ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: