తమిళ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తలపతి విజయ్ వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన బీస్ట్ అనే మూవీ తో విజయ్ ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందింది.

మంచి అంచనాల నడుమ ఈ సినిమా తమిళ్ , తెలుగు , కన్నడ ,  మలయాళ ,  హిందీ భాషల్లో విడుదల అయింది. ప్రస్తుతం తలపతి విజయ్ తమిళం లో రూపొందుతున్న వరిసు అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పోస్టర్ లను మరియు ఒక పాటను విడుదల చేసింది.

వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో వారసుడు అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీని ఇప్పటి వరకు మూవీ యూనిట్ ప్రకటించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన ఈ మూవీ ని థియేటర్ లలో విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: