ఈ సంవత్సరం డిజాస్టర్ స్టార్ గా మంచు విష్ణు మిగిలిపోయారు. ఏదో పగబట్టినట్లు సినిమా లవర్స్ అంతా కూడా మంచు విష్ణు సినిమాలను బాయ్ కాట్ చేస్తున్నారు.

అసలు మొత్తంగా మంచు ఫ్యామిలీ హీరోలు నటించిన చిత్రాలను చూసేది అయితే లేదంటున్నారు. వారి సినిమాలు ఆడుతున్న థియేటర్స్ వైపు వెళ్లడం లేదు. ఈ మధ్య కాలంలో మోహన్ బాబు, విష్ణు నటించిన మోసగాళ్లు, సన్ ఆఫ్ ఇండియా, జిన్నా చిత్రాలు విడుదలయ్యాయి. మోసగాళ్లు చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో కూడా విడుదల చేశారు.

మోసగాళ్లు మంచు విష్ణుకు భారీ నష్టాలు మిగిల్చింది. కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి వంటి స్టార్ క్యాస్ట్ నటించడంతో పాటు అధిక బడ్జెట్ తో మూవీ ని అయితే నిర్మించారు. ఇక మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా అయితే ఎపిక్ డిజాస్టర్. కనీసం పోస్టర్ ఖర్చులు, పార్కింగ్ చార్జీలు కూడా రాలేదు. ఆ పరంపరను జిన్నా కొనసాగించింది. మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ కాంబినేషన్ లో కామెడీ హారర్ చిత్రంగా అక్టోబర్ 21న విడుదలైంది. జిన్నా మూవీ పాజిటివ్ తెచ్చుకొని కూడా కనీస వసూళ్లు కూడా రాబట్టలేదు.

ఇక యూఎస్ లో ఐతే ఈ చిత్రం అరుదైన రికార్డు నమోదు చేసింది. మొత్తంగా 153 టికెట్స్ ఏమో అమ్ముడుబోయాయి. జిన్నా వరల్డ్ వైడ్ షేర్ అటూఇటుగా రూ. 50 లక్షలు. నిన్నగాక మొన్నొచ్చిన చిన్న హీరో విశ్వక్ సేన్ ఓరి దేవుడా మూవీ అదే సమయంలో విడుదలై మిక్స్డ్ టాక్ తో దాదాపు రూ. 2 కోట్ల షేర్ అయితే రాబట్టింది. జిన్నా కలెక్షన్స్ ఆ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖర్చులకు రాలేదు. సన్నీ లియోన్ రెమ్యూనరేషన్ అయితే ఎక్కడో ఉంది. జిన్నా చిత్రానికి ఆమె కోటి రూపాయల పైనే తీసుకున్నారని తెలుస్తుంది.


ఇక మూవీ విడుదలై ఐదు వారాలు దాటినా కూడా ఓటీటీలోకి రాలేదు. సడన్ గా అమెజాన్ ప్రైమ్ లో జిన్నా అంటూ ప్రకటన కూడా వచ్చింది. డిసెంబర్ 1 అర్థరాత్రి నుండి ప్రైమ్ లో జిన్నా స్ట్రీమ్ కానుంది. ఈ క్రమంలో ప్రైమ్ యాజమాన్యం జిన్నా చిత్రాన్ని కొనకపోగా ప్రెస్టేజ్ కోసం డబ్బులు ఎదురిచ్చారనే వాదన వినిపిస్తోంది. దీంతో జిన్నా మరోసారి ట్రోల్స్ కి గురవుతుంది. అదే సమయంలో జిన్నా చిత్రానికి ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కుతుందనే ఆసక్తి అయితే కొనసాగుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: