ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరో లలో ఒకరు అయినటు వంటి అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మీనాక్షి చౌదరి మూవీ లో అడవి శేషు సరసన హీరోయిన్ గా నటించగా , శైలేష్ కొలను ఈ మూవీ కి  దర్శకత్వం వహించాడు. నాచురల్ స్టార్ నానిమూవీ ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మించాడు. ఈ మూవీ డిసెంబర్ 2 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ మూవీ రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం లో ఈ మూవీ 3.66 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. సీడెడ్ లో 74 లక్షలు.  యూ ఏ లో 95 లక్షలు . ఈస్ట్ లో 47 లక్షలు .  వెస్ట్ లో 31 లక్షలు .  గుంటూర్ లో 49 లక్షలు .  కృష్ణ లో 42 లక్షలు .  నెల్లూరు లో 27 లక్షలు .  మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో కలిపి హిట్ ది సెకండ్ కేస్ మూవీ 7.31 కోట్ల షేర్ ను , 11.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.


కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఈ మూవీ 85 లక్షలు .  ఓవర్సీస్ లో 2. 80 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో 10.96 కోట్ల షేర్ ను , 19.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: