తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ ఇప్పటికే ఈ సంవత్సరం వలిమై అనే పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మించారు. టాలీవుడ్ యువ నటులలో ఒకరు అయినటువంటి కార్తికేయమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ని తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలో విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే వలిమై లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకులను అలరించిన అజిత్ ప్రస్తుతం తునివు అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి కూడా హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తూ ఉండగా , బోనీ కపూర్మూవీ కి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం అజిత్ కు సంబంధించిన కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా , వాటికి  ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ నుండి మొదటి పాటను డిసెంబర్ 9 వ తేదీన ఈ మూవీ యూనియన్ విడుదల చేయబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 100 నుండి 200 స్క్రీన్ ల వరకు అడ్జస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ కి కనక హిట్ టాక్ వచ్చినట్లు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ కలెక్షన్ లు వచ్చే అవకాశం కూడా చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: