తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరో లలో ఒకరు అయినటువంటి అడవి శేషు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోలో హీరో గా క్షణం మూవీ తో మొట్ట మొదటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ యువ హీరో ఆ తర్వాత వరుసగా గూఢచారి , ఎవరు , మేజర్  , హిట్. 2 మూవీ లతో వరుసగా విజయాలను అందుకుంటూ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.  ఇది ఇలా ఉంటే తాజాగా అడవి శేషు హీరోగా తెరకెక్కిన హిట్ 2  మూవీ డిసెంబర్ 2  తేదీన విడుదల భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా లాభాలను అందుకుంటుంది. హిట్ 2  మూవీ లో మీనాక్షి చౌదరి , అడవి  శేష్ సరసన హీరోయిన్ గా నటించగా , శైలేష్ కోలను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ మూవీ ని నాచురల్ స్టార్ నాని నిర్మించాడు. ఈ మూవీ లో రాము రమేష్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇలా వరస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ యువ హీరో ప్రస్తుతం తన తదుపరి మూవీ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అడవి శేషు తన తదుపరి మూవీ ని రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ లో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: