అల్లు అరవింద్ ఎవరు… తెలుగు సినిమాను శాసిస్తున్న, థియేటర్లను గుప్పిట్లో పెట్టుకున్న ఒక బడానిర్మాత.. ఒక బడా డిస్ట్రిబ్యూటర్.అన్నింటికీ మించి మెగా కాంపౌండ్ లో కీలకమైన వ్యక్తి. మెగాస్టార్ చిరంజీవికి బావమరిది. అలాంటి వ్యక్తి ఏం చేసినా ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు ఆ లెక్క జబర్దస్త్ వద్ద వచ్చి ఆగింది. వాస్తవానికి తన లెక్క ఇక్కడ దాకా వస్తుందని అల్లు అరవింద్ కూడా అనుకుని ఉండడు.

ఆఫ్ట్రాల్ గాలోడు అనుకున్నారు

సుడిగాలి సుధీర్… ఈ పేరు బుల్లితెర మీద ఇప్పుడు ఒక సంచలనం. అతడు నటించగలడు. పాడగలడు.. ఆడగలడు.. అన్నింటికీ మించి మ్యాజిక్ చేయగలడు. ఒకరకంగా చెప్పాలంటే వెర్సటైల్ పర్సనాలిటీ. అలాంటి వ్యక్తి బుల్లితెరను వదిలి వెండితెరకు వచ్చాడు.. మొదట్లో రెండు సినిమాలు త్రీ మంకీస్, సాఫ్ట్వేర్ సుధీర్ అని ఏవో సినిమాలు తీశాడు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేశాడు. కానీ గురి కుదరలేదు.. కానీ ఈసారి ఎందుకో గాలోడు అనే ఒక సినిమా తీశాడు.. ఇది ఫక్తు కమర్షియల్ సినిమా.. రొటీన్ కథ, అవే పిచ్చి గెంతులు.. కానీ సినిమా కోసం సుధీర్ బాగా కష్టపడ్డాడు. అది ప్రతి సీన్లో కనిపించింది..

రెండున్నర కోట్లు వచ్చాయి

సినిమా మొత్తం రెండు కోట్లతో తీశారని అంటున్నారు.. గ్రాస్ మొత్తం ఐదున్నర కోట్లుగా తేలింది.. తీరా లాభం రెండున్నర కోట్లని నిర్మాత అంటున్నారు.. మొత్తానికి ఈ సినిమాలు కొనేందుకు అల్లు అరవింద్ ముందుకు వచ్చారు. తన ఆహా ఓటీటీ లో స్ట్రీమ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సుధీర్ ఎలాగూ నాగబాబుకు దగ్గర, ఈ లెక్కన మెగా కాంపౌండ్ కు ఎప్పుడో దారి వేసుకున్నాడు.. ఆ దారి ఇప్పుడు ఉపయోగపడింది.. సినిమా తీస్తే అసలు కూడా వచ్చే పరిస్థితి లేని ఈ రోజుల్లో… రెండు కోట్లు పెడితే రెండున్నర కోట్ల లాభం వచ్చింది. ఆహా కూడా కోటిన్నర ఇచ్చి సినిమా కొన్నది అంటున్నారు. ఎటు చూసినా మూడున్నర కోట్ల లాభం.. ఒకటికి రెండింతలు… కమాన్ సుధీర్… నువ్వు ఇంకా ఎదగాలి.. ఇదే సమయంలో రొటీన్ హీరోగా కాకుండా మంచి పేరు తెచ్చుకోవాలి. అన్నింటికీ మించి నీ చుట్టూ ఉన్న గ్యాంగ్ ను వదిలేయాలి.

మంచు విష్ణు కు మించి

ఇక ఈ గాలోడు కలెక్షన్లు మంచు విష్ణు సినిమా జిల్లాను మించాయని అంటున్నారు.. మంచు విష్ణు జిన్నా కొనేందుకు ఎవరు కూడా ముందుకు రాలేదు.. అమెజాన్ ఓటిటి కూడా తక్కువ మొత్తంలో ఇచ్చి సొంతం చేసుకుందని అంటున్నారు. ప్రకారం చూసుకుంటే సుడిగాలి సుధీర్ బెటర్ పొజిషన్లో ఉన్నట్టే లెక్క. ఇప్పుడు చేతిలో ఒకటి రెండు సినిమాలు ఉన్నట్టు సమాచారం. అవి గనక క్లిక్ అయితే సుడిగాలి సుదీర్ కు ఇక అడ్డు ఉండదు.. ఇప్పుడు సినిమాకు కొన్న అల్లు అరవింద్ రేపటి నాడు సుధీర్ తో సినిమా తీసే అవకాశాలు కూడా కొట్టి పారేయలేనివి. ఎందుకంటే సినిమా అనేదే డబ్బుల చుట్టూ తిరుగుతుంది.. ఇప్పుడు సుధీర్ కూడా డబ్బులు తెచ్చిపెట్టే హీరో మెటీరియలే. ఇందుకు సాక్ష్యం గాలోడు.

మరింత సమాచారం తెలుసుకోండి: