కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివ కార్తికేయన్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. శివ కార్తికేయన్ ఇప్పటికే తాను నటించిన అనేక మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. శివ కార్తికేయన్ ఆఖరి గా ప్రిన్స్ అనే మూవీ లో హీరో గా నటించాడు. అనిదీప్ కేవీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శివ కార్తికేయన్ "మావిరన్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. మడోనే అశ్విన్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ మూవీ ని మహా వీరుడు అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ సెట్స్ పై ఉండగానే ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఒక ప్రముఖ "ఓ టి టి" సంస్థకు అమ్మివేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థకు అమ్మివేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: