ఇక ఊహించినట్లుగానే 'అవతార్ 2' సినిమాకు ఇండియాలో ఫస్ట్ డే మంచి ఫెంటాస్టిక్ ఓపెనింగ్ అనేది లభించింది. అందులో కూడా ఇక మెజారిటీ వాటా మన తెలుగు రాష్ట్రాలదే.అసలు ఇంతకు ముందు ఏ హాలీవుడ్ సినిమా కూడా కలెక్ట్ చేయలేని విధంగా తెలుగులో 'అవతార్ 2' సినిమా బాక్సాఫీస్ బరిలో వసూళ్ళ సునామి సృష్టించింది.అయితే ఇండియాలో ఓపెనింగ్ డే రికార్డు తన పేరిట లిఖించుకోవడంలో మాత్రం అవతార్ 2 ఫెయిల్ అయ్యింది.ఇక ఇండియాలో సినిమా ఎంత కలెక్ట్ చేసింది? అనే వివరాల్లోకి వెళితే..ఇండియాలో 'అవతార్ 2' సినిమా శుక్రవారం సుమారు 41 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే రూ. 38. 50 నుంచి రూ. 40. 50 కోట్ల మధ్య ఉంటుందని అని ట్రేడ్ వర్గాలు నుంచి సమాచారం అందుతుంది. ఇండియాలో ఈ సంవత్సరం విడుదలైన హాలీవుడ్ సినిమాలు చూస్తే... హయ్యస్ట్ ఓపెనింగ్ డే 'అవతార్ 2' సినిమాదే అని చెప్పాలి. ఇక ఓవరాల్‌గా చూస్తే... రెండో స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేసులో మాత్రం 'అవెంజర్స్ ఎండ్ గేమ్' ఉంది.


ఇక 'అవతార్ 2' కంటే ముందే ఈ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో వచ్చిన యాక్షన్ విజువల్ వండర్ 'అవెంజర్స్ ఎండ్ గేమ్' ఉంది. ఆ సినిమా 2019 వ సంవత్సరంలో విడుదల అయ్యింది. అప్పట్లో ఈ సినిమా ఫస్ట్ డే రికార్డు స్థాయిలో రూ. 53.10 కోట్లు వసూలు చేసింది. దాని కంటే పది పన్నెండు కోట్ల వెనుకే 'అవతార్ 2' సినిమా ఉంది. ఇప్పట్లో 'అవెంజర్స్ ఎండ్ గేమ్' రికార్డ్ ఏ హాలీవుడ్ సినిమా బీట్ చేయలేదేమో అని తెలుస్తుంది.అయితే తెలుగులో మాత్రం అవతార్ 2 అదరహో అనిపించింది.'అవతార్ 2' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాపై ఎంతో విపరీతమైన ఆసక్తి చూపించారు. ఇక ఇండియాలో బుక్ అయిన మొత్తం టిక్కెట్లలో సగం టిక్కెట్లు తెలుగు రాష్ట్రాల నుంచి బుక్ అయ్యాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు కలెక్షన్స్ కూడా ఆ విషయాన్ని పూర్తిగా స్పష్టం చేశాయి. రికార్డులు సంగతి పక్కనపెడితే అవతార్ 2 ఓపెనింగ్స్ బాగానే రాబట్టి సేఫ్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: