తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటువంటి విశాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశాల్ కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తాను నటించడం ఎన్నో సినిమా లను తెలుగు లో కూడా విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి మార్కెట్ ను సృష్టించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే విశాల్ ఆఖరుగా సామాన్యుడు మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. తాజాగా విశాల్ "లాఠీ" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో విశాల్ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. 

మూవీ ని డిసెంబర్ 22 వ తేదీన తమిళ్ , తెలుగు , హిందీ , కన్నడ , మలయాళ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విచ్చేశారు. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

లాఠీ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ ... ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఐపీఎస్ లు పనిచేయాల్సి వస్తుంది అని మోహన్ బాబు అన్నారు. అధికారులు అంతా ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటారు అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. పోలీస్ వ్యవస్థ అంటే తనకు చాలా గౌరవం ఉందని , ఆయన తాను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ అని తాజాగా మోహన్ బాబు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: