మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన స్టైల్ లో  సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన  త్రిబుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్సినిమా అనంతరం ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆన్ స్క్రీన్ అయిన ఆఫ్ స్క్రీన్ అయినా వినయం లో తండ్రికి తగ్గ తనయుడు గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ లెజెండ్రి దర్శకుడు శంకర్ తో  ఆర్సి 15 సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

 ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. అయితే షూటింగ్ ప్రారంభమై నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ ని కూడా బయటకు రానివ్వలేదు చిత్ర బృందం. దాంతో మెగా అభిమానులు చిత్ర బృందంపై తీవ్ర అసహనాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది .అయితే సంక్రాంతి నా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్లుగా సమాచారం. అంతేకాదు స్పెషల్ గ్లిమ్ప్స్ కూడా చిత్ర బృందం విడుదల చేయనున్నట్లుగా భావిస్తున్నట్లు తెలుస్తుంది.

అంతేకాదు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో రాంచరణ్ డ్యుల్ రోల్  చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్ ను తీసుకుంటున్నట్లుగా  తెలుస్తోంది. అంతా కాదు రామ్ చరణ్ కి జోడిగా ఈ సినిమాకి కీయార ఆద్వాని అంజలి నటిస్తున్నారు. వారితోపాటు నటుడు సునీల్ దర్శకుడు ఎస్ జె సూర్య మరికొందరు కొన్ని కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరో గా  నటిస్తున్న ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీంతో మెగా పవర్ స్టార్ నటించబోయే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుందని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: