తమిళ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజిత్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే అజిత్ తాజాగా తునివు అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసింది.

హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ క్రేజీ మూవీ ని బోనీ కపూర్ నిర్మించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా ఈ తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టైటిల్ ను మరియు అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా అధికారికంగా ప్రకటించింది. 

అజిత్ హీరోగా తెరకెక్కిన తూనీవు మూవీ ని తెలుగు లో తెగింపు అనే టైటిల్ తో విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని తాజాగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం తెగింపు మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అద్భుతమైన రీతిలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఆఖరుగా వలమై మూవీతో ప్రేక్షకులను నిరాశపరిచిన అజిత్ "తెగింపు" మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను ఏ మేరకు అలరిస్తాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: