తెలుగు ఇండస్ట్రీ క్యూట్ భామ అయిన శ్రీలీల గురించి పరిచయం అవసరం లేదు. ఒకే సినిమాతో ఈమె స్టార్ హీరోయిన్ స్థాయి కి ఆమె ఎదిగిపోయిందనే చెప్పవచ్చు.

ఈమె అందం మరియు అభినయం అన్ని కూడా ప్రేక్షకులను ఎంతో మైమరిపించేలా చేస్తాయి.. శ్రీలీల రాఘవేంద్రరావు పర్వేక్షణలో గౌరీ రోణంకి గారి దర్శకత్వం లో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమా ద్వారా సినీ తెరపై ఎంట్రీ ఇచ్చింది.

సినిమా తర్వాత శ్రీలీల చాలా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో బాగా దూసుకు పోతుంది.. ఈమె ఆఫర్స్ వచ్చే కొద్దీ పారితోషకం కూడా భారీగానే పెంచుకుంటూ పోతుంది. ప్రెసెంట్ ఈమె రవితేజ ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. రేపు డిసెంబర్ 23న ఈ సినిమా విడుదల కాబోతుంది.. త్రినాథరావు నక్కిన దర్శకత్వం లో రూపొందిన ధమాకా సినిమాపై అంచనాలు చాలా ఉన్నాయి.

రవితేజ  ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాపై ఎంతో నమ్మకం తో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఈ సినిమాపై మరిన్ని అంచనాల ను పెంచేస్తున్నాడు.. వివేక్ కూచిభట్ల సహా నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను అయితే నిర్మిస్తున్నారు.. ఇంక భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ను అందిస్తున్నారు. మరో 24 గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అంచనాలు కూడా చాలా ఉన్నాయి.

ఇక ఈ సినిమా మీదనే శ్రీలీల కెరీర్ ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా కనుక భారీ విజయం సాధిస్తే శ్రీలీల ఖచ్చితంగా మరిన్ని అదిరిపోయే ఆఫర్స్ ను అందుకుంటుంది అని అంటున్నారట.అలాగే స్టార్ హీరోయిన్ కూడా అయిపోతుంది అనే టాక్ కూడా వినిపిస్తుంది. స్టార్ హీరోయిన్ గా ఎదిగితే ఈమెకు స్టార్ హీరోల సరసన అవకాశాలు కూడా వరిస్తాయి.. అలాగే ఈమె రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: