
ఇక విశాల్ హీరోగా నటించిన లాఠీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కూడా నిన్న థియేటర్లలో చాలా గ్రాండ్గా విడుదల అయింది . ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అయితే అందుకుందని చెప్పాలి.. అయితే అవతార్ 2 ను మించి విజయాలైతే సాధించలేదు. ఐఎండిబి నుంచి 8.5 రేటింగ్ పొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పించింది . అయితే హైదరాబాదులో విడుదల కాగా ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు ఇప్పటికీ ఆ ప్రేక్షకులు అవతార్ 2 సినిమాకే పట్టం కడుతూ ఉండడం గమనార్హం.
అటు నయనతార కనెక్ట్.. ఇటు విశాల్ లాంటి రెండు సినిమాలు కూడా తమిళ్లో విడుదలై అక్కడి నుంచి డబ్బింగ్ ద్వారా తెలుగులో ఒకేసారి విడుదలైన విషయం తెలిసిందే. అయితే తమిళ్లో ఈ సినిమాలు భారీ విజయాన్ని అందుకోగా తెలుగులో మాత్రం అంతంత మాత్రమే ఆడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాల కథ, కంటెంట్ పరంగా బాగున్నప్పటికీ అవతార్ 2 ను మించి లేవన్నట్టుగా ప్రజలు విశ్వసిస్తున్నారు . ఈ రెండు సినిమాలకి అవతార్ 2 భారీ దెబ్బకొట్టిందని చెప్పాలి.