కరోనా పరిస్థితులు చక్కబడటంతో ఈసారి సంక్రాంతికి ధియేటర్లు అన్నీ కళకళలాడుతాయని ఇండస్ట్రీ వర్గాలు ఆశించాయి. దీనికి తగ్గట్టుగానే చాల సంవత్సరాల తరువాత చిరంజీవి బాలకృష్ణల సినిమాల వార్ జరుగుతూ ఉండటంతో ఈసారి సంక్రాంతి ప్రేక్షకులకు జోష్ ను ఇవ్వడం ఖాయం అని అనుకున్నారు అంతా.


ఈ రెండు సినిమాలకుతోడు తమిళ హీరోలు విజయ్ అజిత్ ల సినిమాలతో పాటు ఒక చిన్న సినిమాగా నందినీ రెడ్డి మూవీ కూడ విడుదల అవుతూ ఉండటంతో ఇన్ని సినిమాలలో తెలుగు ప్రేక్షకులు ఎన్ని సినిమాలు చూస్తారు అంటూ అంచనాలు కూడ మొదలయ్యాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా భారత్ లోకి చైనాను అతలాకుతలం చేస్తున్న ఒమైక్రాన్ Bf 7 ఎంటర్ కావడమే కాకుండా దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల పై కూడ ఉంటుంది అని హెచ్చరికలు వస్తున్న నేపధ్యంలో రానున్న మూడు వారాల కాలం చాల కీలకం ఆంటూ ప్రభుత్వ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.


దీనితో సంక్రాంతి సమయానికి పరిస్థితి ఎలా ఉంటుంది అన్న అంచనాలు ఎవరికీ అందడంలేదు. దీనికితోడు సంక్రాంతి సినిమాలకు అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరిగిన పరిస్థితులలో కనీసం మూడు వారాలు భారీ సినిమాలకు జనం వస్తే కానీ ఆసినిమాల బయ్యర్లు గట్టేక్కలేరు. ఇలాంటి పరిస్థితులలో సంక్రాంతి సినిమాల బయ్యర్లు ధైర్యంగా ముందడుగు వేయాలా లేదంటే ఈ భారీ సినిమాలను ఒమైక్రాన్ విషయం తేలిన తరువాత విడుదల చేయమని ఈసినిమాల నిర్మాతలతో రాయబారాలు చేయాల అన్న విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నట్లు టాక్.


చిరంజీవి బాలకృష్ణల ఫైట్ కారణంగా వీరిద్దరి సినిమాలకు తెలుగు రాష్ట్రాలలో ధియేటర్లు దొరకడమే కష్టంగా మారింది అని అంటున్నారు. ఇప్పుడు ఈ ఒమెక్రాన్ భయాలు కూడా వెంటాడితే బయ్యర్ల పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కరోనా వేవ్ లు వల్ల రెండు సంక్రాంతులను పోగొట్టుకున్న ఫిలిం ఇండస్ట్రీ మరొకసారి అదే పరిస్థితి రిపీట్ అయితే చాల నష్టపోయే ఆస్కారం ఉంది..






మరింత సమాచారం తెలుసుకోండి: