
ముందుగా తెలుగు రాష్ట్రాలలో వచ్చిన వసూళ్ళను పరిశీలిస్తే.. నైజాం ప్రాంతంలో ఈ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అక్కడ 3D,4DX, ఐమాక్స్ స్క్రీన్స్ ఉండడం వల్లే అక్కడ ప్రజలు ఈ సినిమాను బాగా వీక్షించారు అని సమాచారం. ఇకపోతే పది రోజులకు గాను ఈ సినిమాకి ఒక నైజాంలోనే 35 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్లో రూ.22 కోట్లు.. సీడెడ్ లో రూ.7కోట్లు 20 లక్షల రూపాయలు రాబట్టింది మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 64 కోట్ల రూపాయల గ్రాస్ వస్తువులు చేసిన ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో రూ.100 కోట్ల మార్క్ ను అందుకోబోతోంది అనడంలో సందేహం లేదు.
నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి . 10 రోజులకు గాను నార్త్ లో 140 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అలాగే కర్ణాటకలో రూ.39 కోట్లు, కేరళలో రూ.20 కోట్లు , కర్ణాటకలో రూ.39 కోట్ల రూపాయలు వచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు ఇండియా మొత్తం మీద 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ అయినట్టు తెలుస్తోంది.