ఈటీవీలో ఎప్పటినుండో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో కి ఎంత మంచి ఆదరణ ఉందో మనందరికీ తెలిసిందే. ఈ షో తో ఎంట్రీ ఇచ్చిన చాలామంది కమెడియన్లు ప్రస్తుతం స్టార్ హీరోల సరసన సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే జబర్దస్త్ కి వచ్చిన చాలా తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందిన హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం హైపర్ ఆది స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులుగా హైపర్ ఆది జబర్దస్త్ షో నుండి తప్పుకున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

 గతంలో కూడా హైపర్ ఆది జబర్దస్త్ షో నుండి వెళ్లిపోయి తిరిగి వచ్చి నా సందర్భాలు ఉన్నాయి.గతంలో జబర్దస్త్ షో నుండి వెళ్లిపోయి తిరిగి వచ్చిన హైపర్ ఆది ఈసారి మాత్రం తిరిగి వచ్చే అవకాశాలు లేవు అన్నట్లుగా తెలుస్తోంది.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హైపర్ ఆది జబర్దస్త్ తో పాటు ఇతర కార్యక్రమాలలో పాల్గొనడం కూడా ఆపేస్తాడు అన్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ క్రమంలోనే హైపర్ ఆది జబర్దస్త్ ను వీడి వెళ్లిన అనంతరం ఈ షోకి ఆయన ప్లేస్ లో సద్దాం మరియు యాదమ్మ రాజు ఎంట్రీ ఇచ్చి జబర్దస్త్ కి వచ్చే నష్టాన్ని తీరుస్తున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

 ఇక యాదమ్మ రాజు మరియు సద్దాం కలిసి నటించిన రెండు ఎపిసోడ్స్ కూడా మంచి సక్సెస్ ను అందుకున్నాయి. సద్దాం మరియు జబర్దస్త్ కామెడీ ని ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక వీరిద్దరూ కలిసి గతంలో పటాస్ షోలో చేసిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాలవల్ల వారిద్దరూ కలిసి వేరే టీవీ షోలకు వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు తిరిగి ఈటీవీకి రీఎంట్రీ ఇవ్వడంతో వారి అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. హైపర్ ఆది జబర్దస్త్ వీడి వెళ్ళిపోయిన అనంతరం ఈ షో టి ఆర్ పి దారుణంగా పడిపోయిన సమయంలో సద్దాం మరియు యాదమ్మ రాజు ఎంట్రీ ఇచ్చి దాన్ని కాపాడుతున్నారు అన్న కామెంట్లు సైతం వ్యక్తం అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: