మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా వచ్చే నెల సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.అయితే ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని థియేటర్స్లలో గ్రాండ్ గా ఆహ్వానించేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన సెలబ్రేషన్స్ ని ఇదివరకు ఎవరో చేయని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చేయాలని అంటున్నారు. ఇక ఈ ఈవెంట్ కి మెగా బ్రదర్ నాగబాబు కూడా హాజరు కావడం జరిగింది.  ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు చిరంజీవి గురించి మాట్లాడిన పలు వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అయితే గతంలో జరిగిన ఒక కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు గరికపాటి కూడా వచ్చిన సంగతి తెలిసింది. ఇక ఈ సందర్భంగా స్టేజి మీదకి వచ్చిన చిరంజీవితో అందరూ సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో ఆవేశానికి ఎదురైన గరికపాటి మీ ఫోటో షూట్  ఆపి వెంటనే ఇక్కడికి రావాలి. లేకపోతే నేను వెళ్ళిపోతాను అంటూ చేసిన కామెంట్లు  సోషల్ మీడియా వేదికగా ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు అభిమానులతో జరిగిన సమావేశంలో నాగబాబు ఈ విషయంపై మాట్లాడడం జరిగింది.మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ

 అన్నయ్య చిరంజీవికి ఉన్న మంచితనాన్ని చాలా మంది చాలా అలుసుగా తీసుకుంటున్నారు. కానీ అన్నయ్య మాత్రం వాటన్నిటిని చిరునవ్వుతో ఆహ్వానిస్తాడు. ఆయన ఇలాంటివి ఓపిక పట్టినప్పటికీ తమ్ముడు గా నేను మాత్రం ఊరుకోను కచ్చితంగా అలాంటి వాటి అన్నిటిపై కూడా నేను స్పందిస్తాను అని చెప్పుకొచ్చాడు మెగా బ్రదర్ నాగబాబు.  ఇటీవల జరిగిన ఒక ఈవెంట్ కి వచ్చిన చిరంజీవిని ఒక పెద్దమనిషి చాలా అవమానించిన సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక అందుకుగాను నాకంటే ముందు మరియు నాకంటే ఎక్కువగా మెగా అభిమానులే రియాక్ట్ అయ్యారు. నువ్వు ఎంత పెద్ద తోపు అయితే మాకేంటి మేము ఎవరిని అవమానించము అలాగని మమ్మల్ని అవమానిస్తే ఊరుకోము చాలామంది ముందు మా అన్నయ్యని నువ్వు అవమానించావు అయినప్పటికీ మేము నోరు మూసుకొని ఉన్నాం. అది మా మంచితనం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు మెగా బ్రదర్ నాగబాబు.దీంతో నాగబాబు చేసిన ఈ కామెంట్లు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: