టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు  నాగ చైతన్య ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే నాగ చైతన్య కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా హిందీ లో కూడా లాల్ సింగ్ చడ్డ అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించి హిందీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య "కస్టడీ" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అరవింద స్వామి ... ప్రియమణిమూవీ లో ఇతర కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇళయరాజా , యువన్ శంకర్ రాజా ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నారు. 

మూవీ లో నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. కెరియర్ లో మొట్ట మొదటి సారి నాగ చైతన్యమూవీ లో పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. కస్టడీ మూవీ ని వచ్చే సంవత్సరం మే12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: