టాలీవుడ్ యువ కథానాయకులలో ఒకరు అయినటువంటి నిఖిల్ తాజాగా 18 పేజెస్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. కార్తికేయ 2 లాంటి భారీ బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత నిఖిల్ నుండి వస్తున్న మూవీ కావడం ... కుమారి 21 ఎఫ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన మూవీ కావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుని. ఈ 10 రోజుల్లో 18 పేజెస్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం ఏరియాలో 4.24 కోట్లు , సీడెడ్ లో 80 లక్షలు ,  యూఏ లో 85 లక్షలు ,  ఈస్ట్ లో 53 లక్షలు ,  వెస్టులో 29 లక్షలు ,  గుంటూరు లో 37 లక్షలు ,  కృష్ణ లో 31 లక్షలు ,  నెల్లూరు లో 19 లక్షలు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10 రోజుల్లో ఈ సినిమా 7.54 కోట్ల షేర్ ,  14.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 70 లక్షలు ,  ఓవర్సీస్ లో 1.41 కోట్లు.  మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో ఈ సినిమా 9.65 కోట్ల షేర్ ,  19 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటికి కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: