తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు ఇప్పటికే ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ మూవీలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం దర్శకుడు గుణశేఖర్ ... అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన రుద్రమదేవి అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో దర్శకుడిగా గుణశేఖర్ క్రేజ్ మరింతగా పెరిగింది.

మూవీ లో దగ్గుపాటి రానా ... అల్లు అర్జున్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు గుణశేఖర్ "శాకుంతలం" అనే భారీ బడ్జెట్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంత ప్రధాన పాత్రలో నటించగా ... దేవ్ మోహన్ ... మోహన్ బాబు ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను ఫిబ్రవరి 17 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ధియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా యూనిట్ ఈ మూవీ కి సంబంధించిన మరో అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా శాకుంతలం మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.  ఈ మూవీ యొక్క ట్రైలర్ ను 9 జనవరి 2023 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 06 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ చిత్రం బృందం ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: