
ఆ తర్వాత కాలంలో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప పాన్ ఇండియా సినిమాలో డి గ్లామరస్ పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించిన రష్మిక ఇప్పుడు విజయ్ హీరోగా నటిస్తున్న వారసుడు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఒకటి రెండు చిత్రాలే తప్ప మరో చిత్రాలు లేవని చెప్పడంలో సందేహం లేదు. అయితే రష్మిక సినిమాల కంటే వాణిజ్య ప్రకటనలు, బ్రాండ్ల ద్వారా డబ్బు సంపాదించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా మరో మూడు కొత్త బ్రాండ్లకు సంతకం చేసినట్లు సమాచారం.
ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రష్మిక మందన్న సినిమాల కంటే ప్రకటనలు మరియు బ్రాండ్ల పైన ఎక్కువ దృష్టి పెడుతుందని.. ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఒక సినిమాలో నటిస్తే వచ్చే పారితోషకం కంటే ప్రకటనలు, బ్రాండ్ల ద్వారా వచ్చే పారితోషకం రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఈ క్రమంలోని ఈమె వరుస ప్రకటనలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. వీటి ద్వారా ఏడాదికి సుమారుగా రూ.20 కోట్లకు పైగానే సంపాదించే అవకాశం ఉందని సమాచారం.