తెలుగు సినిమా ఆర్టిస్ట్ సుధ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు సుధ అంటే తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండడు. ఎందుకంటే కొన్ని వందల తెలుగు చిత్రాల్లో ఎన్నో పాత్రల్లో ఆమె ఒదిగిపోయింది. ముఖ్యంగా ఎంతో మంది హీరోలకి అమ్మగా నటించి.. ఎంతగానో అలరించింది.కొన్ని వందల చిత్రాల్లో నటించి తనకంటూ స్పెషల్ మార్క్ ఏర్పరుచుకుంది సుధ. ఫస్ట్ హీరోయిన్ గా ఎదగాలని ఆమె ఆరాటపడ్డారు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ అయితే ఇండస్ట్రీలో ఎక్కువకాలం .ఉండగలమని. ఫేమస్ డైరెక్టర్ బాలచందర్ సలహా ఇవ్వడంతో సుధ అలా సెటిల్ అయ్యారు. తమిళనాడు శ్రీరంగంలో మంచి సంపన్నుల కుటుంబంలో పుట్టారు సుధ. ఆమెది తమిళనాడు వాసి అయినా తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు. లేట్ అల్లు రామలింగయ్య సలహాతో తెలుగుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. సుధ సొంతగా డబ్బింగ్ చెప్పేవారు. ఆ విధంగా ఆమెకు సినిమాలలో ఎన్నో వందల అవకాశాలు వచ్చాయి. వరస అవకాశాలు రావడంతో..సినిమాలలో చాలా బిజీ అయిపోయారు సుధ. ఎక్కువ సినిమాలు చెయ్యడం వల్ల డబ్బు కూడా బాగానే సంపాదించారు. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన సుధ.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.


ఢిల్లీలో హోటల్ బిజినెస్ చేయడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు సుధ.కొంతమంది నమ్మినవాళ్లు కూడా ఆమెను నిండా ముంచేశారు. ఆమె భర్త కూడా  వదిలేసి.. ఫారెన్ వెళ్లిపోయాడు. కొడుకు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో.. అతనితో కూడా సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. కొడుకు ఉన్నాడనే కానీ.. కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడడని చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు సుధ. తన చిన్నతనంలోనే తల్లిని పొగొట్టుకున్నాని… పెద్దయ్యాక తన తండ్రికి క్యాన్సర్ సోకి చనిపోయారని ఆమె చెప్పుకొచ్చారు. ఆ టైంలో తనకు నలుగురు అన్నదమ్ములు ఉన్నా కూడా కనీసం కన్నెత్తి చూడలేదని.. తన తండ్రి చనిపోయే వరకు తానే చూసుకున్నట్లు తెలిపారు.జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తిన్నానని వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు చెప్పారు. దేవుడు మనం ఏం చేయాలో ముందే నిర్ణయిస్తాడని ఆమె చెప్పుకొచ్చారు. భవిష్యత్ గురించి కలత చెందడం మానేశానని ఆమె వివరించారు. నచ్చిన పని చేసుకుంటూ వెళ్లడమే అన్నింటికన్నా మంచిదని ఆమె చెబుతున్నారు. తనకు ఉన్నదాంట్లో సంతృప్తి వెతుక్కుంటూ ముందుకు సాగడం తనకు బాగా అలవాటైందని సుధ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: