టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పేపర్ బాయ్ ,ఏక్ మినీ కదా, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాలతో టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సంతోష్ శోభన్. తన నటనతో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు కూడా పొందాడు.అయితే తాజాగా ఈయన కళ్యాణం కమనీయం అనే సినిమా చేయనున్నారు.ఇక ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ సంతోష్ సరసన హీరోయిన్గా నటించిన అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో ఈ సినిమా సంక్రాంతి కానుకగా 14న విడుదల కానుంది. ఇక ఈ సందర్భంగా ఈ సినిమాలో తన ఎక్స్పీరియన్స్ ని తన అభిమానులతో పంచుకున్నాడు ఈ యంగ్ హీరో. 

ఇందులో భాగంగానే సంతోష్ మాట్లాడుతూ.. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలి అన్నది నా కల. ఈ సంక్రాంతి కానుకగా నా సినిమాతో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.నేనైతే సంక్రాంతికి వీర సింహారెడ్డి ,వాల్తేరు వీరయ్య ,వారసుడు ఈ మూడు సినిమాలు చూస్తాను. వీటితో పాటు నా సినిమా కూడా చూస్తాను. ఈ మూడు సినిమాలతో పాటు నా సినిమా కూడా విడుదల కావడం చాలా స్పెషల్. గతంలో నాన్న దర్శకత్వం వహించిన మరియు ప్రభాస్ అన్న హీరోగా నటించిన వర్షం సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అయింది. నేను ఇప్పటికే చాలా పాత్రల్లో నటించను.

కానీ ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ చాలా జెన్యూన్ గా ఉంటుంది. సినిమా చూసినంత సేపు ఆ క్యారెక్టర్ నిజంగానే ఉంది అనుకునే అంతలాగా నా క్యారెక్టర్ ఉంటుంది.ఇందులో భాగంగానే సంతోష్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ అన్న నాకు ఇచ్చే సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభాస్ అన్న ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ హీరో. ఈ సినిమాకి కాదు నేను నటించినా నా పాత సినిమాల ప్రమోషన్లలో కూడా ప్రభాస్ అన్న సపోర్ట్ గా నిలిచాడు. నేను ప్రభాస్ అన్నకి వీరాభిమానిని మా ఇద్దరి మధ్య ఒక అభిమాని మరియు ఒక స్టార్ హీరో మధ్య ఉన్న సంబంధం ఉంది. ప్రభాస్ అన్న ప్రేమ నాకు దక్కినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి అంటూ చెప్పుకొచ్చాడు సంతోష్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: