టాలీవుడ్ రేంజిని గ్లోబల్ రేంజికి తీసుకెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి మూవీతోనే తెలుగు ఇండస్ట్రీ గురించి ప్రతిఒక్కరు మాట్లాడుకునేలా చేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశారు.ఇక ఆర్ఆర్ఆర్ మూవీ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే..ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది ఈ సినిమా. ఏకంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో సత్తా చాటింది ఆర్ఆర్ఆర్ సినిమా. లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో..నాటు నాటు పాట ఈ సూపర్ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు..బెస్ట్‌ సాంగ్‌ అవార్డ్‌ గెలుచుకుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి హాలీవుడ్ సెలెబ్రెటీస్ మధ్య గోల్డెన్‌ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. ఈ సాంగ్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ స్టెప్పులు ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే చాలా అవార్డులను గెలుచుకున్న RRR..ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్‌ అవార్డుల్లో కూడా తన సత్తా చాటింది.ఇక తాజాగా దర్శకుడు రాజమౌళి హాలీవుడ్ టాప్ దర్శకుడు జేమ్స్ కెమరూన్ ను కలిశారు.


జేమ్స్ కెమరూన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు. టైటానిక్ సినిమాతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన జెమ్స్. ఆ తర్వాత అవతార్ సినిమాతో వరల్డ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు. ఆ సినిమాతో సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి అందరిని ఎంతగానో ఆశ్చర్యపోయేలా చేశారు.అలాగే ఇప్పుడు అవతార్ 2 సినిమాతో కూడా మరో సెన్సేషనల్ హిట్ ను తన ఖాతలో వేసుకున్నాడు జేమ్స్. అంతటి స్టార్ దర్శకుడుని తాజాగా రాజమోళి కలిశారు. ఇక ఆ విషాయాన్ని తెలుపుతూ.. ట్వీట్ చేశారు జక్కన్న రాజమౌళి. గ్రేట్ జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ మూవీని చూశారు. ఆయనకు సినిమా ఎంతో నచ్చడమే కాకుండా, ఆ మూవీని చూడాలంటూ తన భార్య సుజీకి సూచించారు.ఆయన కూడా ఆమెతో కలిసి మరోసారి సినిమాని చూశారు. సర్ మీరు మాతో 10 నిమిషాల సమయం కేటాయించడం ఇలా మా గురించి విశ్లేషిస్తారని అనుకోలేదు.ఇక మీరన్నట్టుగా నేనిప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీ ఇద్దరికీ నా ధన్యవాదాలు'' అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి: