మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీమణులలో ఒకరు అయినటువంటి సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత "ఏం మాయ చేసావే" మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకొని , ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే సమంత కమర్షియల్ మూవీలలో తన అందచందాలను ఆరబోయడం మాత్రమే కాకుండా , ఎన్నో వైవిధ్యమైన మూవీలలో తన నటనతో కూడా ప్రేక్షకుల అలరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందులో భాగంగా పోయిన సంవత్సరం సమంత లేడీ ఓరియంటెడ్ మూవీ అయినటువంటి యశోద లో ప్రధాన పాత్రలో నటించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా యశోద మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్.లో ఉన్న సమంత తాజాగా శాకుంతలం అనే మూవీలో ప్రధాన పాత్రలో నటించింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని ఈ సంవత్సరం ఫిబ్రవరి 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. 

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ నుండి ఫస్ట్ లిరికల్ వీడియోను జనవరి 18 వ తేదీన తెలుగు , హిందీ , కన్నడ , తమిళ్ , మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లోని మొదటి సాంగ్ ను తెలుగు , హిందీ , కన్నడ భాషలలో "మల్లికా మల్లిక" అని సాగనున్నట్లు , తమిళ్ లో "మల్లిగా మల్లిగా" అని సాగనున్నట్లు , మలయాళం లో "మల్లికే మల్లికే" అని సాగనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: