ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజ్ పేరు ఎరగని వారుండరు. టాలీవుడ్ ను శాసించే ఆ నలుగురులో ఒకరుగా పేరుగాంచిన దిల్ రాజ్ నిర్మించిన ‘వారసుడు’ మూవీ తమిళంలో డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ హీరో విజయ్ కు ఉన్న మ్యానియాతో ఈ మూవీ పండగరోజులు పూర్తి అయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు కలెక్ట్ చేసింది అని వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.


కొన్ని సంవత్సరాల క్రితం దిల్ రాజ్ అతడి మొదటి భార్య మరణించడంతో ఆతరువాత దిల్ రాజ్ రెండవ పెళ్ళి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో దిల్ రాజ్ పెళ్ళి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దిల్ రాజ్ ను పెళ్ళి చేసుకున్న తరువాత అతడి భార్య వైఘా తేజస్వని గా పేరు మార్చుకుంది.


కొన్ని నెలల క్రితం ఒక మగబిడ్డకు ఆమె జన్మను ఇవ్వడంతో దిల్ రాజ్ మళ్ళీ తండ్రి అయ్యాడు. ఈమధ్య వీరిద్దరూ కలిసి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజ్ భార్య తనకు దిల్ రాజ్ తో ఏర్పడిన మొట్టమొదటి పరిచయాన్ని గుర్తుకు చేసుకుంది. తేజస్విని వైఘా గా ఉన్న రోజులలో ఆమె ఎయిర్ హోస్టెస్ గా పని చేసేదట. ఆ సందర్భంలో ఒకసారి ఫ్లైట్ లో దిల్ రాజ్ తన వద్ద పెన్ లేకపోవడంతో తనకు పెన్ కావాలని దిల్ రాజ్ వైఘా ని అడిగాడట. అప్పుడు ఆమెకు దిల్ రాజ్ తో ఏర్పడిన పరిచయం ఆపై ప్రేమ ఆతరువాత పెళ్ళిగా మారిందట.


దిల్ రాజ్ ను పెళ్ళి చేసుకునే వరకు వైఘా కు సినిమాల పై అసలు ఆశక్తి లేదట. ఆమె చూసిన తెలుగు సినిమాలు కూడ చాల తక్కువట. అలాంటి వ్యక్తి వరసపెట్టి సినిమాలు తీసే నిర్మాతను పెళ్ళి చేసుకోవడం యాధృశ్చికం అనుకోవాలి. ఒకొక్కసారి జీవితంలో అనుకోని సంఘటనలే జరుగుతాయి..
మరింత సమాచారం తెలుసుకోండి: