
ఈమూవీలో ఒక సన్నివేశంలో తాను చాల బాగా నటించాను అని ప్రశంసలు రావడానికి తనకు పవన్ పై ఉన్న విపరీతమైన ప్రేమ కారణం అంటూ కామెంట్ చేసాడు. ఈమూవీలో ఒక సీన్ లో రవితేజాను వెనక నుంచి పొడుస్తారు. ఆసమయంలో చనిపోయే స్థితిలో ఉన్న రవితేజా ను బతికించుకోవడానికి వీరయ్య పాత్రలో నటించిన చిరంజీవి ప్రయత్నిస్తాడు. ఆసన్నివేసం చాల సహజంగా వచ్చింది. దీనికి విమర్శకుల ప్రశంసలు కూడ లభించాయి.
ఇలా ఆసీన్ లో తాను సహజంగా నటించడానికి స్ఫూర్తి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ అని చిరంజీవి అంటున్నాడు. తన తమ్ముడు పవన్ కు ఎవరైనా హాని చేస్తే తనకు తెలియకుండానే ఎలా అయితే భావోద్వేగం కోపం కన్నీరు వస్తాయో చావు బతుకుల మధ్య ఉన్న రవితేజా స్థానంలో తాను పవన్ ను ఊహించుకుని అంత సహజంగా నటించాను అంటున్నాడు.
వాస్తవానికి పవన్ రవితేజాలు ఇంచుమించు ఒకేసారి ఇండస్ట్రీలోకి రావడంతో వారిద్దరు తనకు ఎప్పటికీ చిన్న పిల్లలుగానే కనిపిస్తారని అందువల్లనే వారిద్దరి పై తనకు విపరీతమైన ప్రేమ అంటూ కామెంట్స్ చేసాడు. ఇదే ఈవెంట్ కు అతిధిగా వచ్చిన రామ్ చరణ్ మాట్లాడుతూ తన తండ్రి చిరంజీవి పై ఎన్ని విమర్శలు వచ్చినా తన తండ్రి కొనసాగిస్తున్న మౌనాన్ని అలుసుగా తీసుకోవద్దని ఎదో ఒక రోజు ఆయన మౌనం వీడకపోయినా తాను తన తండ్రి పై విమర్శలు చేసిన వారికి గట్టి సమాధానం ఇచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు..