ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకరి తర్వాత ఒకరు భారీ బ్యాగ్రౌండ్ తో ఇక వారసులుగా ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం అవుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా వారసులుగా వస్తున్న వారు మంచి కథలను ఎంచుకుంటూ ఇక వరుస విజయాలు సాధిస్తూ హీరోలుగా నిలదొక్కుకుంటూ ఉంటే మరి కొంతమంది ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోలేకపోతున్నారు. ఇంకొంతమంది అయితే తమ బిహేవియర్ తో ఇక సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతున్నారు అని చెప్పాలి. ఇలా వచ్చిన మొదటి సినిమాతోనే సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్స్ ఎదుర్కొన్న వారసుడు ఎవరు అంటే చంద్రహాస్ పేరు ముందుగా వినిపిస్తూ ఉంటుంది.


 చంద్రహాస్ ఎవరో కాదు బుల్లితెరపై మెగాస్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న నటుడు  ప్రభాకర్ కుమారుడు కావడం గమనార్హం. ఇక అతని మొదటి సినిమా ఎలా ఉందో అన్నది పక్కన పెడితే అతని యాటిట్యూడ్ మాత్రం సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు అప్పుడే ఇంత యాటిట్యూడ్ ఏంట్రా బాబు అని ట్రోలర్స్ అతని బాగానే ఆడేసుకున్నారు. అంతేకాదు అతనికి యాటిట్యూడ్ స్టార్ అనే ఒక ట్యాగ్ కూడా ఇచ్చేశారు నెటిజన్లు అని చెప్పాలి. ఇక సినిమా ప్రారంభం సందర్భంగా నిర్వహించిన ఒక ఫంక్షన్ లో చంద్రహాస్ ఎక్స్ ప్రెషన్స్, ఆటిట్యూడ్ కెమెరా ముందుకు ఊగిపోతూ ఫోజులు ఇవ్వడం ఎంతో వైరల్ గా మారిపోయింది. దీంతో అతను ట్రోల్స్ ఎదుర్కొన్నాడు.


 అయితే ఆరోజు సినిమా ప్రారంభం ఫంక్షన్ లో ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనే విషయంపై ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. ఆరోజు తాను కావాలని అలా చేయలేదు అంటూ చెప్పుకోచ్చాడు. కెమెరాల ముందు తన తండ్రి తనను పొగుడుతుంటే నవ్వు ఆపుకోలేక అలా చేశాను అంటూ చంద్రహాస్ చెప్పుకొచ్చాడు. కావాలని చేసింది కాదని అది యాటిట్యూడ్ కూడా కాదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అందరూ దాన్ని తప్పుగా అర్థం చేసుకొని నాకు కాస్త ఎక్కువగా యాటిట్యూడ్ ఉందని ట్రోల్ చేశారని ఆ ట్రోల్స్ ని స్ఫూర్తిగా తీసుకున్నానని చెబుతున్నాడు చంద్రహాస్. నిజానికి ఈ ట్రోల్స్ కారణంగానే చంద్రహాస్ ఓవర్ నైట్ లో పాపులారిటీ సంపాదించుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: