లాటరీ తగులుతుందో లేదో చెప్పడం ఎంతకష్టమో ఒక సినిమా హిట్ అవుతుందో లేదో చెప్పడం కూడ అంతేకష్టం. ఈవిషయంలో ఎంతో అనుభవం ఉన్న దర్శకులు నిర్మాతలు కూడ అంచనా వేయలేరు. ‘కాంతారా’ విడుదల కాకముందు ఆసినిమా తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుందని ఆసినిమాను విడుదలచేసిన అల్లు అరవింద్ కూడ అనుకోకపోవడంతో ఆసినిమాను అతి తక్కువ రేట్లకు అమ్మేసారు అని అంటారు.


ఎక్కడో మనకు ఏమాత్రం తెలియని కర్ణాటక ఆచారాన్ని దేవుడి నమ్మకాన్ని దర్శకుడు రిషబ్ శెట్టి చూపించిన తీరు తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో ఆసినిమాకు కనక వర్షం కురిపించారు. ఈ స్పూర్తితో అల్లుఅరవింద్ ‘మాలికాపురం’ అనే మరో అనువాద చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తీసుకొచ్చారు. మళయాలంలో ఇటీవలే విడుదలై సూపర్ హిట్ అయిన ఈమూవీ 100 కోట్ల మార్క్ ను చాల సులువుగా అందుకుంది.


ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈమూవీని కనీసం తెలుగు ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోలేదు. సమంత నటించిన ‘యశోద’ లో డాక్టర్ గా నెగటివ్ క్యారెక్టర్ చేసిన విషయం తెలిసిందే. గతంలో అనుష్క తో ఇతడు ‘భాగమతి’ సినిమాలో కూడ నటించాడు. అయ్యప్ప మాలాధారుల కాన్సెప్ట్ ను ఆధారంగా చేసుకుని దర్శకుడు విష్ణు శశిశంకర్ దానికి చైల్డ్ సెంటిమెంట్ ను పెట్టి ఈమూవీని తెలుగులో డబ్ చేస్తే కనీసపు కలక్షన్స్ కూడ రావడంలేదు అని తెలుస్తోంది.


రిపబ్లిక్ డే నాడు విడుదలైన ఈమూవీని చూడటం కంటే బాలీవుడ్ మూవీ ‘పఠాన్’ పై ఆశక్తి కనపరుస్తూ ఉండటంతో ఈమూవీకి కనీసపు కలక్షన్స్ కూడ రావడంలేదు అని వార్తలు వస్తున్నాయి.ఇక పఠాన్’ మ్యానియాకు సుధీర్ బాబు నటించిన ‘హంట్’ మూవీ కూడ దెబ్బతినడంతో ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అంతా షారూఖ్ ఖాన్ మ్యానియాలోనే ఉన్నారు అనుకోవాలి. ఒక బాలీవుడ్ సినిమా దెబ్బకు రెండు తెలుగు సినిమాలు దెబ్బతినడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..



మరింత సమాచారం తెలుసుకోండి: