లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ అయిన కాజల్ అగర్వాల్ (Kajal Agarwal). ఈమె మొదటి రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది.ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా అవకాశాలు కూడా రావడంతో కొద్దిరోజుల్లోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయిపొయింది.

ఇదిలా ఉంటే కెరియర్ జోరు లో ఉన్న టైంలోనే తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లి కూడా అయింది ఈ భామ . ఇక తాజాగా ఓ బాబు పుట్టాక కాజల్ మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలని కూడా భావిస్తుంది. ఇక ఈ నేపద్యంలోనే కాజల్ బాలకృష్ణ సరసన ఓ సినిమాలో నటించబోతుంది అంటూ ఇప్పటి కే కొన్ని వార్తలు కూడా వినిపించాయి.

అయితే ఆ సినిమాvలో బాలకృష్ణ కాజల్ ఇద్దరు భార్యా భర్తలు గా నటిస్తే వారి కూతురుగా యంగ్ హీరోయిన్ శ్రీలీలా నటించబోతుందని సమాచారం.. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడిందని తెలుస్తుంది..శ్రీలీల తమ కూతురుగా నటించడంతో కాజల్ కి భయం మొదలైందని సమాచారం..ఎందుకంటే ఈ మధ్యకాలంలో శ్రీ లీలా హీరోయిన్గా వచ్చిన ధమాకా సినిమాలో హీరో రవితేజను మించి ఆమె పర్ఫామెన్స్ ను అందించింది..

ఇక ఈ సినిమాలో ఆమె అందానికి చాలా మంది ఫిదా అయ్యారు. కాబట్టి కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) ఆమె కు తల్లిగా నటించబోతున్న నేపథ్యంలో ఆమెని మించి శ్రీ లీల పర్ఫామెన్స్ ఉంటుందని తెలుస్తుంది.ఒకవేళ నన్నే మించిపోతే ఇక నా కెరీర్ కొలాప్స్ అని కూడా భావిస్తుందట.మరి కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు అందుకుంటుందో లేదో చూడాలి. ఇప్పటికే భారతీయుడు 2 సినిమా లో కూడా నటిస్తుంది. ఆ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: