టాలీవుడ్ చిత్ర పరిశ్రమ యొక్క గొప్ప తనాన్ని  సినిమా సినిమాకి వరల్డ్ వైడ్ గా  చాటి చెబుతున్నారు మన దర్శక నిర్మాతలు. దాని వల్ల  టాలీవుడ్ మూవీస్ లకు గ్లోబల్ స్థాయిలో ఆడియన్స్ మరియు అవార్డ్స్ దొరుకుతున్నాయి.

ఐతే ఒకప్పటి స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి నేడు ఉన్న జూనియర్ ఎన్టీఆర్,నాగచైతన్య,రామ్ చరణ్ లాంటి యంగ్ హీరోల వరకు తెలుగు సినిమా యొక్క ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఐతే వాళ్ళు తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని  పెంచడంతో పాటుగా పాన్ ఇండియాస్టార్లుగా కూడా గుర్తింపు తెచ్చుకున్న విషయం కూడా తెలిసిందే. అలాగే ఇప్పుడు తరువాత జనరేషన్ కూడా సిద్ధం ఐనట్లు తెలుస్తోంది.

సినిమా ఇండస్ట్రీకి ఐనా సరే కొత్త కొత్త హీరోలు హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడం అన్నది సహజంగా జరిగిపోయే ఒక ప్రక్రియ అని అందరికి తెల్సిన విషయమే. అయితే కొన్నిసార్లు తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ కొందరు హీరోగా హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తే మరి కొందరు కొత్త వాళ్లు ఏ టువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ తర్వాత జనరేషన్ కూడా స్టార్లు దొరికేసారని అభిమానులు నెటిజన్స్ చెప్పడంతో పాటు వారి ఫోటోలను కూడా నెట్టింట్లో షేర్ చేస్తూ సంతోషపడుతున్నారు. మరి ఆ స్టార్లు మరెవరో కాదు పవన్ కళ్యాణ్ తనయుడు ఐనా అకిరా నందన్, అలాగే మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఆ లిస్ట్ లో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.లేటెస్ట్ గా హైదరాబాదులో జరిగిన ప్రిక్స్ ఈవెంట్ కి హాజరైన వీళ్ళ ఫొటోస్ ప్రెసేంట్ సోషల్ మీడియా కి చిక్కి కాబోయే  ఫ్యూచర్ స్టార్లు అంటూ తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే దీనికి వారి ఫ్యాన్స్ కూడా తెగ సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మహేష్ బాబుల వారసత్వాన్ని అందిపుచ్చుకొని వారు కూడా స్టార్స్ గా రాణించాలని వారి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఐతే ఇప్పటికే వీరిద్దరికీ నెట్టింట్లో లో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. కాగా పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట్లో లో వైరల్ అవ్వడం చూసి పవన్ అభిమానులు తండ్రి తగ్గ తనయుడు అని అతన్ని చూసి తెగ సంతోష పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: